నేడు గజ్వేల్ లో దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రజాయుద్దనౌక గద్దర సంస్మరణ సభ గజ్వేల్ లో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు స్థానిక టిపిటిప్ భవన్ లో ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పాటకి ప్రాణం పొసి ప్రపంచ దేశాలకు పాటను పరిచయం చేసిన పాటల ఊట చెరువు ప్రజాయుద్దనౌక గదరన్న సంస్మరణ సభను దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరం కలిసి నిర్వహించుకుందాం గద్దర్ ను స్మరించుకుందాం. దళిత సంఘాల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మిక, కర్షక, ఉపాధి కూలీలు ప్రగతిశీల శక్తులు అందరం కలుద్దాం గద్దరన్నను యాజ్జేసుకుందాం రండి కదలిరండని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బామ్ సేఫ్ జాతీయ కమిటీ సభ్యులు సురేందర్ సింగ్, డాక్టర్ కుమార్, డి బిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, ప్రశాంత్, జోసెఫ్, రాములు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.




