ముసాబాద్, అక్టోబర్ 5, (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో రోడ్లపై రైతులు వరి ధాన్యం ఆరబెట్టితే తక్షణమే ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ధాన్యం కంటే అతి ప్రమాదకరమైనవి రాయి కంకర ఇక ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా నెలలు గడుస్తున్న రోడ్డుకు ఆనుకొని రాయి కంకరను ప్రజలు గమనించి తప్పు పడుతున్నారు. గూడెం గ్రామం కొంచెం దాటగానే ఆవునూరు వైపు కంకరకుప్ప ఏదో నిర్మాణం పోశారా లేదా కావాలని పోశారా ఓవైపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఇంత నిర్లక్ష్యమాని మండిపడుతున్నారు. స్థానికులు రోడ్లపై వరిధాన్యం ఆరబోస్తేనే చర్యలు తీసుకుంటారా ఈ రాయి కంకర పోసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాని బాటసారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.




