కర్బుజ కాయ మీద అమ్మవారి అద్భుత చిత్రాన్ని చిత్రించారు
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 4
దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కర్బుజ్ కాయ మీద కళానైపుణ్యంతో అమ్మ వారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో శుక్రవారం నాడు ఆవిష్కరించి పూజించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్ని జరుగుతాయన్నారు. దుర్గాదేవి నవరాత్రులు కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. మహిళలందరు కూడా వడిబియ్యం సమర్పించు కుంటారు. ఆది పరాశక్తిని నియమ నిష్ఠలతో 9రోజులు భక్తులు మాల ధరించి దీక్ష వహిస్తారు. జై దుర్గామాత నామాన్ని స్మరిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు కొల్చుకుంటారన్నారు.
