జగిత్యాల:
కోరుట్లలో దివంగత నేత జువ్వడి రత్నాకర్ రావు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న
పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
ఏదైనా చేయాలనుకుంటే కంకణం కట్టుకొని పూర్తి అయ్యేవరకు క్రమశిక్షణతో పని చేయాలని రత్నాకర్ రావు చెప్పేవారు.
సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి దాకా ఎదిగి ఎంతమంది అభిమానాన్ని చురగొనడం వెనుక ఎంత కృషి ఉందో అర్థం అవుతుంది.
ఈ రోజు జువ్వాడి జయంతి. జువ్వాడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది
గత పది సంవత్సరాల క్రితం మా తాత, జువ్వాడి వారిద్దరినీ కలిసినప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.
డిసిప్లిన్ గా పని చేయాలని నాకు మంచి మాటలు చెప్పిన వ్యక్తి జువ్వాడి.
స్వర్గీయ రత్నాకర్ రావు నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపం.
తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు.
గ్రామ సర్పంచ్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ఉమ్మడి ఏపీకి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడు.
