ప్రాంతీయం

పండగ సందర్భంగా వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్న శాడిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం

71 Views

మంచిర్యాల జిల్లా

*దసరా మరియు దీపావళి సందర్భంగా వ్యారస్తులను ఇబ్బంది పెడ్తున్న శాడిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం* – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి .

*మంచిర్యాల లోని మార్కెట్ వ్యాపారస్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమ కట్టడాల పేరుమీద కక్షసాధింపు చర్యల్లో భాగంగా వ్యాపార సముదాయాల కూల్చివేతలను సందర్శించి ఆయా వ్యాపారస్తులను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరెబెల్లి రఘునాథ్ *

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాత్రికి రాత్రి దొడ్డి దారిలో మార్కింగులు చేసి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాపార సముదాయాలను కూల్చివేయడం వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే అని అన్నారు.దసరా దీపావళి పండుగల సందర్భంగా ఈ సమయంలో వ్యాపారం బాగా జరిగే అవకాశం ఉంటదని ఎన్నో ఏండ్లుగా పేద మధ్యతరగతి కుటుంబాలు మార్కెట్ ఏరియాలో జీవనోపాధి పొందుతుంటే వారి పొట్ట కొట్టి అక్రమ కట్టడాల పేరున పండుగల సమయం లో మంచిర్యాల పట్టణ వ్యాపారస్తులను ఈ శాడిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతుంది అని అన్నారు.

కేవలం కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయలేదని మంచిర్యాల వ్యాపారస్తుల ను టార్గెట్ చెయ్యడం సరికాదన్నారు.అక్రమకట్టడాలకు భారతీయ జనతా పార్టీ కూడా విరుద్ధమే కానీ ఇలాంటి కక్ష సాధింపు కూల్చివేతలను ఖండిస్తున్నాం అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వ్యాపారస్తులను పిలిపించుకొని ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం చేయాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా వాగులను కబ్జా చేసి ప్లాట్లు పెట్టీ ఇండ్లు నిర్మించిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఈ యొక్క కూల్చివేతలు రాజకీయ ప్రతిపక్ష పార్టీ నాయకుల నుండి మొదలుపెట్టి ఈరోజున పేద మధ్యతరగతి వ్యాపారస్తులను టార్గెట్ చేశారన్నారు.భారతీయ జనతా పార్టీ తరపున ఒకటే హెచ్చరిస్తున్నాం దసరా దీపావళి పండుగల సందర్భంగా కూల్చివేతలను ఆపేయ్యాలని అన్నారు.పండుగల తర్వాత వ్యాపారస్తులను పిలిపించి వారితో చర్చించి ప్లాన్ ప్రకారం చెయ్యాలని అన్నారు.లేని యెడల భారతీయ జనతా పార్టీ వ్యాపారస్తులకు అండగా ఉండి వారి పక్షాన నిలిచి పోరాడుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రజనీష్ జైన్, జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రమేష్, BJYM జిల్లా అధ్యక్షులు బొలిషెట్టి అశ్విన్,మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి రాకేష్ రెన్వా, నస్పూర్ పట్టణ ప్రదాన కార్యదర్శి కుర్రే చక్రవర్తి,సీనియర్ నాయకులు మెట్టుపల్లి జయరాం, బింగి ప్రవీణ్ మరియు బీజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్