ప్రాంతీయం

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది

58 Views

అవును రాజ్య మాతగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది

హర్షించదగ్గ విషయం: అధ్యక్షులు రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 30

భారతీయ సాంప్రదాయంలో అవుకు ఉన్న సంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించి అవును రాజ్య మాతగా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవు అమ్మ లాంటిది. సకల దేవతలు కొలువై ఉంటారన్నారు. వ్యవసాయంలో ఆవు పేడ వాడడం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయని, ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక, ఆర్థిక, అంశాల్లో ప్రాముఖ్యత ఉందని పేర్కొని, దేశి ఆవులు తగ్గిపోతుండడంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రతి రాష్ట్రం కూడ ఈ తోవలోనే నడవాలన్నారు. ప్రతి హిందువు ఇంట్లో ఓ గోమాత తప్పకుండ ఉండాలన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్