ప్రాంతీయం

లోక్ అదాలత్ లో 6903 కేసుల పరిష్కారం

35 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*లోక్ అదాలత్ లో 6903 వేల కేసుల పరిష్కారం*

*రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నమోదైన 66 కేసులలో 17,01,816 నగదు రిఫండ్*

రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి సెప్టెంబరు 28వ తేదీన నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)  ఆదేశాలు, సూచనల ప్రకారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి 15 రోజుల నుండి కేసులలో ఉన్న నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో రామగుండం కమిషనరేట్ పరిధిలో *6903 కేసులు* పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,  ప్రత్యేక అభినందనలు తెలిపారు.
జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 61 సైబర్ క్రైమ్ కేసులలో మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 5 కేసులలో కలిపి మొత్తం 66 కేసులలో 17,01,816 నగదు బాధితులకు ఇప్పించేందుకు గౌరవ కోర్ట్ ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగింది అని సీపీ  తెలిపారు.

*లోక్ అదాలత్ పరిష్కరించబడిన కేసుల వారీగా వివరాలు*

????FIR కేసుల సంఖ్య (కాంపౌండబుల్) పరిష్కరించబbడింది – *952*

????విపత్తు నిర్వహణ చట్టం కేసుల సంఖ్య (ఈ-పెట్టీ కేసులు మాత్రమే) – *230*

????ఇ-పెట్టీ కేసుల సంఖ్య (విపత్తు నిర్వహణ చట్టం కేసులు మినహా) – *2609*
????MV చట్టం కేసుల సంఖ్య (డ్రంకెన్ డ్రైవింగ్ కేసులతో సహా) – *3112*

*28 సెప్టెంబర్ 2024 రోజున మొత్తం డిస్పోజల్ అయినా కేసులు – *6903 కేసులు*

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్