ప్రాంతీయం

ఆశవర్కర్లకు మద్దతుగా రాష్ట్ర కోఆర్డినేటర్ క…

93 Views

ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్7, బీసీవిద్యార్థి సంఘం ఆశవర్కర్లకు పూర్తి మద్దతు తెలిపిన బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అంబేద్కర్ చౌరస్తావద్ద ఆశవర్కర్లు చేస్తున్న సమ్మేకు రవిగౌడ్ వాళ్లకు పూర్తిమద్దతు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు. వాళ్లకు ఉద్యోగ భద్రత అలాగే వారి జీతం 18,వేల వరకు పెంచాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే కరోనా టైంలో వాళ్ళ ప్రాణాల తెగించి గ్రామాలలో కరోనా గురించి ప్రజలకు వివరించారని తెలిపారు. ఈరాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు వెంటనే వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 13 రోజుల నుండి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని ఇప్పటికైనా వాళ్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈకార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం తంగళ్ళపల్లి అధ్యక్షుడు గౌరీ రాకేష్ ముదిరాజ్ నాయకులు లక్ష్మణ్ నవీన్ వంశీ అశోక్ తల్లులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *