ముస్తాబాద్, సెప్టెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిది): మద్దికుంట గ్రామస్తులు గత 30సంవత్సరాలనుండి S.C. రిజర్వేషన్ రాలేదని ఈసారైనా మాకు రిజర్వేషన్ కలిపించాలని మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల ఇంచార్జ్ కే.కే. మహేందర్ రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేశారు. గత ఏలక్షన్ లో కుడా sc రిజర్వేషన్ అపి, గత బిఆర్ ఎస్ ప్రబుత్వ పాలనలో నాయకులు పలుకుబడిని ఉపయోగించి తమకు అనుకులంగా తెచ్చుకొని బారత రాజ్యాంగాన్ని తుంగలో వేసి ఎన్నికల కమిషన్ ను పక్కదారి పట్టించిన నాయకులపై చట్టపరమైనా చర్యలు తీసుకోని ఇసారి sc రిజర్వేషన్ వచ్చేలా చూడాలని సిరిసిల్ల నియోజకవర్గా ఇన్ చార్జ్ కే.కే. మహేందర్ రేడ్డిని కోరారు. ఇందులో గ్రామస్తులు మద్దికుంట గ్రామ శాఖ దోనుకుల కొండయ్య, ఈరని రాజు, ఈరని నరేష్, మండల కాశీమ్, బట్టు బాలయ్య, పల్లాటి వెంకట్, సుంచు బాలయ్య, మండల మహేష్, బట్టు కొండయ్య, సుంకరి ప్రశాంత్, పల్లాటి అశోక్, కుదిదుల అంజి, బట్టు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
