ప్రాంతీయం

జాతీయ జెండా ను ఎగురవేసి నివాళులు అర్పించారు

155 Views

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తండా కనకయ్య గౌడ్ జాతీయ జెండా ను ఎగురవేసి నివాళులు అర్పించారు

సిద్దిపేట్ జిల్లా జూన్ 2

సిద్దిపేట జిల్లా  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తండా కనకయ్య గౌడ్ జాతీయ జెండా ను ఎగురవేసి నివాళులు అర్పించారు.అనంతరం మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్ మండలంలోని కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చిన ఏఐసీసీ అధినేత సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం మండల కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేసి, స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల ఆంక్షలు నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రము ఇచ్చిందని అమరుల త్యాగంతో ఏర్పాటైన రాష్ట్రాన్ని,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరింత అభివృద్ధి దిశగా వెళుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుమల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి, గ్రామ పార్టీ అధ్యక్షులుజితేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్, సుగుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,సత్యనారాయణ, అన్వర్, గణేష్,నర్సింలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found