మంచిర్యాల జిల్లా.
బెల్లంపల్లి పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయానికి Dr BR అంబేద్కర్ పేరు పెట్టాలి – మాదిగ హక్కుల దండోరా డిమాండ్.
బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన నూతన కూరగాయల మార్కెట్ సముదాయానికి Dr BR అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కి మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జక్కుల శ్వేత గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాట్లాడుతు గత కొన్ని సంత్సరాలుగా Dr BR అంబేద్కర్ సర్కిల్ ఏరియాలో కూరగాయలు అమ్ముతున్న కూరగాయల వ్యాపారస్తుల కోసం నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయం కు అంబేద్కర్ పేరు పెట్టాలి అని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుంది
అలాగే మున్సిపాలిటీ పాలక వర్గం అంబేద్కర్ విగ్రహ సర్కిల్ సుందరికరణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అంబేద్కర్ చౌరస్తాను అభివృద్ధి చేయాలని మాదిగ హక్కుల దండోరా మున్సిపాలిటీ పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గంగారపు రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,కాంపల్లి రాజం రాష్ట్ర కార్యదర్శి, పంగ రామచందర్ ,ర్రాష్ట్ర నాయకులు,అకునూరి రాజకుమార్ ప్రధాన కార్యదర్శి,సుంకు ఐలయ్య జిల్లా నాయకులు,ఆరేపల్లి రమేష్ నాయకులు పాలుగున్నారు.





