ప్రాంతీయం

బ్రష్ తో సెస్ ప్రచారం…

135 Views

ముస్తాబాద్ డిసెంబర్ 17, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సెస్ డైరెక్టర్ అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి గురువారం రోజు నామినేషన్ వేసిన విషయం విధితమే ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు రైతులకు అందుబాటులో ఉంటూ ఎంత పెద్ద సమస్య అయినా నాసమస్యగా భావించి ప్రజలకు సేవలందిస్తానని ముస్తాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కూడలిలో బ్రష్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును ప్రతి ఒక్కరు వేయాలని ఆయన కోరారు. దీంతో బిజెపి ఈగుర్తుతో నేటి నుండి ప్రచారానికి సిద్ధం కానున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, గూడెం శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found