గ్రామ సభలో పోడు భూముల సమస్యలు…
తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించడం జరిగిందని చెప్పారు
సర్పంచ్ సెక్రెటరీ రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
