గజ్వేల్ నియోజకవర్గం లోని ముంపు గ్రామాలైన ఆర్ అండ్ ఆర్ కాలనీ వేముల ఘట్ పల్లెపహాడ్ గ్రామాలలో బుధవారం రోజున అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.వేముల ఘాట్ గ్రామంలోని నెలకొన్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వివరిస్తున్న వేములఘాట్ సర్పంచ్ బాలయ్య. వేముల ఘాట్ గ్రామ సర్పంచ్ బాలయ్య మాట్లాడుతూ మా గ్రామంలోని సమస్యలు 165 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ప్రభుత్వం ఇచ్చింది కానీ 165 ఫ్లాట్లు ఇంతవరకు చూపించలేదు ఒక దగ్గర చూపించిన అది కొంత భూమి కోర్టు కేసులలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం 165 మంది ప్రజలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కి కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉంటున్నారు.ఇప్పుడు ఎలక్షన్ సమయం కావడంతో ఇప్పుడు ఉంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గజ్వేల్ వారికి కేటాయిస్తే మా పరిస్థితి ఏంది అని భయభ్రాంతులకు గురి అవుతున్నారు,ఇంకా 170 మందికి ఫుల్ ప్యాకేజీ ఇచ్చింది ప్రభుత్వం వారికి ప్లాట్లు 170 మందికి ఫ్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు వచ్చే ఎలక్షన్ సమయంలోపు మాకు ఎటువంటి కోర్టు కేసులు లేకుండా 165 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి, 50 మందికి ఫుల్ ప్యాకేజీ, 170 మందికి ఫుల్ ప్యాకేజీ ఇచ్చారు కానీ ప్లాట్లు ఇవ్వలేదు వారికి ఈ ఎలక్షన్ సమయంలోపు ఫ్లాట్లు ఇవ్వాలని గ్రామ ప్రజలు కలెక్టర్ కి తెలిపారు. దీనికి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో బాలరాజ్,వేముల ఘట్ సర్పంచ్ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
