ప్రాంతీయం

ఆవాలతో కొండ లక్ష్మణ్ బాపూజీ అద్భుత చిత్రం

53 Views

● ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు

● దేశం గర్వించదగ్గ నేత కొండ లక్ష్మణ్

ఉద్యమ శిఖరం, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి సందర్బంగా వినూతంగా ఆవాలను ఉపయోగించి అత్య అద్భుతంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ విముక్తికి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు, ఉద్యమ జీవి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. గాంధీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ నేత. అయన కళలు కన్న ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్