ముస్తాబాద్ డిసెంబర్ 3 తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ముస్తాబాద్ మండలం కొత్త బస్టాండ్ సమీపంలో చిత్రపటానికి పూలమాలవేసి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చింతోజి బాలయ్య మాట్లాడుతూ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి అమరుడు కావడం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని అన్నారు. ఎన్నో కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. తెలంగాణ ప్రజలు చారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంత్ చారి జీవిత చరిత్రలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీకాంత్ చారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుల అధ్యక్షుడు చింతోజి బాలయ్య, అనిల్ చారి, సతీష్ చారి, శ్రీనివాస్ చారి విశ్వబ్రాహ్మణ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.




