నాటు సార అమ్మితే చర్యలు తప్పవు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట / ప్రతినిధి సెప్టెంబర్ 27ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గంభీరావుపేట మండలం లోని నాగంపేట్ లింగన్నపేట లక్ష్మీపూర్ తండాల యందు నాటు సారాయి సరుకు సంబంధించిన రవాణా జరుగుతున్న సమాచారం మేరకు రూట్ వాచ్ చేస్తున్నప్పుడు వాహనాలు తనిఖీ చేయగా ఆల్టో కార్ లో నాటు సారా ముడి సరుకులు అయినటువంటి 50 kgబెల్లం10kg పటిక వాటితో పాటు ఐదు లీటర్ల గుడుంబా లభ్యమైనది రవాణా చేస్తున్నటువంటి అజ్మీర నాజం మాచారెడ్డి నివాసి పై కేసు నమోదు చేశామన్నారు డానియేలు ఉన్నటువంటి ముడి సరుకులను నాటు సారాయిని స్వాధీన పరుచుకున్నమనీ ఎక్సైజ్ సీఐ ఎం శ్రీనివాస్ విలేకరుల ప్రకటనలో తెలిపారు ఈ దాడిలో పాల్గొన్న కానిస్టేబుల్ రాజు మల్లేష్ కిషోర్ కృష్ణ కాంత్ భవానీలు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట్ వీర్నపల్లి కోనరావుపేట మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా నాటు సారాయి తయారీ అమ్మకాలు జరిపితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలియజేస్తూ నాటు సారాయి గంజాయి పట్టిక బెల్లం ఎవరి వద్దనైనా కలిగి ఉన్నట్లయితే 871 26 58 830 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. నాటసార అమ్మితే చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్ హెచ్చరించారు.
