ప్రాంతీయం

41 పల్స్ పోలియో కేంద్రాలలో 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశాం

101 Views

41 పల్స్ పోలియో కేంద్రాలలో 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశాం

మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి

ఎల్లారెడ్డిపేట మార్చి 04

ఎల్లారెడ్డిపేట , వీర్నపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పరిధిలోని 41 పల్స్ పోలియో కేంద్రాలలో సోమవారం వరకు 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేయడం జరిగిందని మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపారు ,
పల్స్ పోలియో కార్యక్రమాన్ని మార్చి 03 వ తేదీ నా ప్రారంభించామని సోమవారం మంగళవారం రెండు రోజుల పాటు రూట్ సూపర్ వైజర్లు 164 మంది వైద్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేస్తూ 100 శాతం పోలియో డ్రాప్స్ లక్ష్యం పూర్తి చేస్తామని డాక్టర్ స్రవంతి చెప్పారు,
పుట్టిన పిల్లవాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు ,
ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు అంగవైకల్యం రాకుండా ఉండేందుకు పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి తల్లి దండ్రుల నుంచి విశేష స్పందన లభించింది

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7