24/7 తెలుగు న్యూస్ :వర్గల్ భూ నిర్వాసితుల ఆందోళన
వర్గల్ : వర్గల్ మండల కేంద్రంలో టి జి ఐ ఐ సి లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందించిన ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ కబ్జాలు చూపకపోవడంతో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు.1495, 1510 సర్వే నెంబర్ లో నిర్మాణాలు చేపడుతున్న కంపెనీల ప్రతినిధులతో రైతులు మాట్లాడుతూ… ప్లాట్లు ప్యాకేజీలు పూర్తిస్థాయిలో అందించిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని కోరారు. కొంతమంది భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని దానిపై రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వేలు నిర్వహించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పలువురు రైతులు పాల్గొన్నారు.
