దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి, దౌల్తాబాద్ లోని పలు కుటుంబాలను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. దీపాయంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ దుర్గేష్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స చేసుకొని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని చిందం రాజ్ కుమార్ ఆయనను పరామర్శించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామంలో బిజెపి నాయకులు మర్కంటి నరసింహులు తండ్రి రాజయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. గౌడ సంఘం నాయకులు రాజ్ కుమార్ మిత్రులు పులుగారి నర్సాగౌడ్ పక్షవాత అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించారు. ఆయన వెంట జక్కసత్యం, రమేష్ గౌడ్, రెడ్డి శ్రీనివాస్, మొద్దు రాజు తదితరులున్నారు..
