దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్, శేరి పల్లి బందారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం దోమల నివారణ కోసం ఆల్ఫా సైపర్ మైత్రీన్ మందు పిచికారి చేశారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గాలి రమేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాజు, బాల్ రాజు, శ్రీనివాస్, రాజు, పాష, రమేష్, శ్రీకాంత్, అజహర్ తదితరులు పాల్గొన్నారు…




