తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేసిన హైందవ సంఘాల ఐక్యవేదిక సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ఇందిరాపార్క్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు దేవాలయాల జేఏసీ, హైందవ సోదరులు, హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ సైదాకు పిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ, శేషం శ్రీనివాసచార్యులు, వెంకటేశ్వర ఆలయం చైర్మన్ బుక్క రమేష్ మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
