ప్రాంతీయం

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి లేదంటే…

106 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్ లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ త్వరితగతిన విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో వచ్చే 26వ తేదీన జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా విద్యార్థుల పైన విద్యార్థుల సమస్యల పైన ఇంతవరకు నోరు మెదపక పోవడం చాలా దురదృష్టమని ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేస్తామని ఇప్పుడు విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన లేదు ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న 800 కోట్ల స్కాలర్షిప్లు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల ఉన్నత చదువులకు కృషి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలో స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితీ దాపరించింది పై చదువులకు  వెళ్లలేకపోతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు  కోడం వెంకటేష్, సాయి, శ్రీను, అరవింద్, రోహిత్, గణేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7