ముస్తాబాద్, సెప్టెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): గత ప్రభుత్వంలో ఓ వార్డులో ఓ వ్యక్తి నన్ను గెలిపిస్తే ఇంటింటికి నల్లాలు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు ఇంకా అనేకమైన పథకాలు ప్రభుత్వాన్ని ఎదిరించి ఇప్పిస్తానని నమ్మబలికి వాగ్దానాలు ఇచ్చి చేతులు దులుపుకొని తీరా గెలిచాక చేతులెత్తేసి తెల్లబట్టలతో రోడెక్కిన వైనం.. మండలంలో చోటు చేసుకుందని పలువురు వార్డు సభ్యులు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా ఓ బడా వ్యాపారాలున్న నాయకునితో చేతులు కలిపి నూతన గృహ నిర్మాణాల కట్టడాలపై తనశక్తి సామ్యర్థాలతో ఇబ్బందులకు గురిచేస్తూ కార్యాలయాల్లో అధికారులతో కుమ్మక్కై లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ పొరుగూరి వ్యక్తి ద్వారా మావార్డులో ఏమి అభివృద్ధి నోచుకోని మాజీ వార్డు సభ్యుడిపై స్థానికులు మండిపడుతున్నారు.
