సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ శివభక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం లో జగదేవపూర్ మండల పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ ,స్థానిక సర్పంచ్ లక్ష్మి రమేష్ తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు పూజారులు ప్రతాపరెడ్డికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శివభక్త మార్కండేయ స్వామి వారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, నాయకులు శ్రీశైలం, సత్యనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
