ప్రాంతీయం

ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలి – సిపి

172 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ *

*ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలని మత పెద్దలకు సూచన: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*

*మిలాద్‌-ఉన్‌-నబి* ర్యాలీ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండము పోలీస్‌ కమిషనర్‌ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,ఐజి తెలిపారు.

ఈరోజు పెద్దపల్లి పట్టణం లో సీపీ సందర్శించి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లు ను పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., ఇతర పోలీస్ అధికారులతో కలిసి సీపీ పరిశీలించి ప్రశాంతమైన వాతావరణం లో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. రెండు రోజుల కిందట శాంతియుత వాతావరణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారని, అదే స్ఫూర్తితో మిలాద్‌-ఉన్‌-నబీ ర్యాలీలను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేసి ర్యాలీలు నిర్వహించే నిర్వాహకులతో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ర్యాలీ తీసే మార్గాలను ముందుగానే తెలుసుకొని, ఆ మార్గాల్లో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్త్ ఏర్పాటు జరిగింది అన్నారు.

సిపి వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, పెద్దపెల్లి ఏ సి పి జి కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్