ప్రాంతీయం

ఏబీవీపీబందుకు సహకరించిన ప్రభుత్వ పాఠశాలలు…

180 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26,రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బందు పిలుపుతో అందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్దికాలం గడిచినా కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలుపలికి వారిహామీలను అమలు చేయకుండా రెగురైజేషన్ పేరుమీద 8,624 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవని, 6800 ప్రాథమిక పాఠశాలలో ఓకే టీచరు ఉన్నారని, 596 మండలాల్లో 578 మండలాలకు విద్యా అధికారులు లేరని కనీసం పాఠశాలలో స్విపర్స్ లేక ఉపధ్యాయులు విద్యార్థులు శుభ్రం చేసుకునే పరిస్థితి నెలకొందని రాష్ట్రములో కొన్ని పాఠశాలలు శిథీలా వ్యవస్థలో ఉండి వర్షానికి నానుతు ఎండకు ఎండుతూ ఎప్పుడు కుప్పకూల్తాయన్న పరిస్థితులున్నాయన్నారు. విద్యాహక్కుచట్టం అమలు చేయాలనీ గతంలో మనఊరు-మనబడి కార్యక్రమానికి 7. కోట్ల నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీలతో చేతులు దులుపుకొని మళ్లీ ఇప్పుడు మరొక నాటకంతో తెరపైకి వచ్చి మళ్లీ 3500 కోట్లతో పాఠశాలల అభివృద్ధి అంటూ హడావుడి చేసిందన్నారు. రాష్ట్రంలో 15వేలటీచర్ పోస్టులు ఖాళీగాఉన్న వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మౌలిక వసతులు లేకుండా ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థికి ఏవిధంగా నాణ్యమైన విద్య అభ్యసించేదరు అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు గాలికి వదిలేసి కార్పొరేట్ శక్తులకు చేయూతనిస్తూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగలా పీలుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడంలేదని, కార్పొరేట్ శక్తులకు సహకరిస్తుందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుతెరిచి విద్యార్థి జీవితాలపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కృషి చేయాలని ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *