ముస్తాబాద్, సెప్టెంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని చీకోడు గ్రామానికి చెందిన కరెడ్ల మమత 2019 స్థానిక ఎన్నికల్లో చీకోడ్ చిప్పలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోగా రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వస్తే ప్రజలు అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా మామామ సేవలందించారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కావలసిన నిధులు తీసుక రావాడానికి మరింత సులభంగా ఉంటుందని తెలిపారు. గ్రామ ప్రజల్లో మమతకు మంచి గుర్తింపు ఉందని మహిళా రిజర్వేషన్ వస్తే తనని తప్పకుండా ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
