ప్రాంతీయం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు  జెండా ఆవిష్కరించారు…

49 Views
 ముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద మండల పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్జల రాజు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం హార్షణీయమని ప్రతి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగర వెయ్యాలని ఆదేశించారు. నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు ,మహిళలపై జరిగిన దాడులు, ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో గత ప్రభుత్వం అధికారికంగా ఎందుకు  జరపలేదని అన్నారు. గతoలో కేసిఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదన్నారు. కేవలం కుటుంబ పాలన భాగంగా నిర్వహించారని పేర్కొన్నారు. విమోచన దినోత్సవానికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్..ఆయన నిజాం మెడలు వంచి తెలంగాణ తెచ్చి ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెళ్ళీ శ్రీనివాస్ గౌడ్, మిడిదొడ్డి భాను కుమార్, కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు, తలారి నరసయ్య, వేముల సత్యంగౌడ్, మద్దిగుంట సత్యం గౌడ్, కొండల్ రెడ్డి, ఏలుసాని దేవయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్