జగదేవపూర్ మండల కేంద్రం లో సోమవారము కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ కవిత, మండల నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ బాలేశం గౌడ్,పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మండల కో అప్షన్ సయ్యద్ ఇక్బాల్ ,మండల నాయకులు,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు,అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.