వివి ప్యాడ్ పై వినియోగంపై అవగాహన కలిగించిన అధికారులు…?
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వివి ప్యాడ్ సమాచార ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని పలువురు యువకులకు కొత్తగా ఓటర్ కార్డు రావడంతో వారు ఎలా ఓటు వేయాలో అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న చాలామందికి ఎవరికి ఓటు వేశారో తెలియక సతమతమవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమాచార వాహనాన్ని పంపించి ప్రజలకు అవగాహన కల్పించడం ప్రజలను మేల్కొల్పుతోందని స్థానిక ఎంపిటిసి పందిర్ల నాగరాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పందిర్ల నాగరాణి తో పాటు అంగన్వాడి టీచర్లు కోర్రి సునిత. ఎం కవిత. జూనియర్ అసిస్టెంట్లు శంకరయ్య. ఆంజనేయులు. బాలకృష్ణ. పోలీసు అధికారి రవీందర్రావు పలువురు గ్రామ ప్రజలు. పలువురు సీఏలు తదితరులు పాల్గొన్నారు
