మండల కేంద్రంలో భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వినాయకుని శోబయాత్ర బుధవారం తెల్లవారుజామున 8 గంటల వరకు కొనసాగింది.అనంతరం వినాయకుని లడ్డు వేలం వేయగా మండల కేంద్రానికి చెందిన రెడ్డి శ్రీనివాస్ పదివేల ఒక వంద పదహారు రూపాయలకు దక్కించుకున్నారు.
