ముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్యం కార్మికులు గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా మీస లక్ష్మీపతి తండ్రి ఎల్లయ్య ఒక్కసారిగా నేలపై పడిపోగా తోటి సిబ్బంది హుటా హుటిన స్థానిక పీపుల్స్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే ప్రాణాలు పోయాయని నిర్దారించినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు. సీనియర్ సిబ్బంది పోషరాములు, మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ గత 20 సం, కోడి కూయక ముందు రేయింబవళ్లు సెలవు లేకుండా విధులకు హాజరై నిర్వహిస్తూనే ప్రాణాలను వదిలిన మాతోటి కార్మికునికి ప్రభుత్వం తక్షణమే10, లక్షలురూ. అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఇందులో పారిశుద్ధ్యం కార్మికులు తదితరులు పాల్గొన్నారు
