మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగో వార్డ్ లో ఉన్న వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి.
ఈ సందర్భంగా తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడి దయతో గ్రామ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.అనంతరం వార్డ్ సభ్యులు అందరూ కలిసి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉప్పసర్పంచ్ పద్మనర్సింలు, లక్ష్మణ్ ,స్వామి, నాగరాజు పంతులు ,వేణుగోపాల్,నవీన్,హరీష్, తదితరులు పాల్గొన్నారు.
