24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2)
సంగారెడ్డి పట్టణంలోని సాయికృప నగర్ కాలానికి చెందిన మహిళా నర్సమ్మ(54) అదృష్యమైనట్లు పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 1వ తేదీ ఇంట్లో వాళ్లతో గొడవపడి ఉదయం 11 గంటలకు బయటకు వెళ్ళింది. బంధువులు చుట్టుపక్కల గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త జనార్ధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ లభిస్తే ఈ 08455-276333 నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు.
