రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమాన్ని సర్పంచ్ మంగోలి నర్సా గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించారు.స్థానిక సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు సైబర్ నెరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఫోన్ చేసిన పలకరించిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుపకూడదని, యువత గంజాయి గుడుంబా ఇతర డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, మహిళ పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రార్ధించరాదని అన్నారు. ఏదైనా అత్యవసరాలకు తప్ప అనవసరాలకు 100 డయల్ కు కాల్ చేయకూడదని అన్నారు.
