-లడ్డు సొంతం చేసుకున్న బేతి నరేందర్ రెడ్డి స్వాతి దంపతులు
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలోని రామాలయం మట్టి వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు,గ్రామ ప్రజలు లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు. ఈ వేలంపాటలో బేతి నరేందర్ రెడ్డి స్వాతి దంపతులు 66116 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు హరి పంతులు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని మట్టి వినాయకుని లడ్డు గత సంవత్సరాలలో పొందినవారు అష్టైశ్వర్యాలతో వారు కోరుకున్న కోరికలు నెరవేరాయని,స్వామి వారి దయతో ఈ సంవత్సరం లడ్డు పొందిన దంపతులకు కూడా వారి కోరికలు నెరవేరాలని, స్వామివారి కృపా కటాక్షం కలగాలని కోరుకున్నారు. అనంతరం ఆటపాటలతో పెద్దలు భజనలు చేస్తూ,పిల్లలు డాన్సులు చేస్తూ,కోలాటం బృందం నాట్యం చేస్తూ అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో,ఆలయ పూజారి రాజశేఖర్ శర్మ,శ్యాంసుందర్,వెంకట్ రెడ్డి,లక్ష్మణ్, కృష్ణమూర్తి,అశోక్,కిష్టారెడ్డి, శేఖర్,రమేష్, రాములుస్వామి,ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
