ప్రాంతీయం

మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

28 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా కార్యక్రమం.

ఏఐసీసీ, టీపిసిసి పిలుపు మేరకు,మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆదేశాల మేరకు.

నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని IT ఆఫీస్ వద్ద మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది.

ఈసందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ  మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్ల మీద బీజేపీ నాయకులు రాజకీయ కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్