వ్యవసాయంలో అధునాతన పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన పెంచి, ఖర్చులు తగ్గించి అధిక లాభాలు పొందేందుకు సెహగల్ ఫౌండేషన్ కృషి చేయుచున్నదని హైటెక్ సీడ్ ప్రాజెక్టు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పి.వి.యన్. శర్మ తెలిపారు. సెహగల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలోని ముబారస్పూర్ గ్రామములో మహిళా రైతులకు ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెహగల్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు నూతన పద్దతులు అనుసరించి, తక్కువ శ్రమ, తక్కువ ఖర్చునుతో అధిక లాబాలు పొందే అందేందుకు సెహగల్ ఫౌండేషన్ కృషి చేయుచున్నదని తెలిపారు. మహిళా రైతుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా అనవసరమైన ఖర్చుల తగ్గించి, మెరుగైన పంట నిర్వహణ పద్ధతుల ద్వారా పంట ఉత్పాదకతను పెంచడం కోసం మెరుగైన సాధనాలు మరియు పనిముట్లు మరియు మెరుగైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం కోసం మహిళా రైతులకు వివిధ పద్దతులు ద్వారా సెహగల్ ఫౌండేషన్ కృషి చేయుచున్నదని ప్రిన్సిపాల్ లీడ్, సలఉద్దిన్ సైఫీ తెలిపారు. 25 మంది మహిళా రైతులకు నాణ్యమైన టమాటా, కొత్తిమీర, మిర్చి, బెండకాయ, సొరకాయ, సొరకాయ, బెండి తదితర కూరగాయ విత్తనాలతో పాటు సూక్ష్మ పోషకాలను అందజేశారు. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ తిరుపతి, హైటెక్ సీడ్ కంపెనీ ప్రతినిది, కార్తిక్ బిస్వాల్, వికాష్ జా, ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్, ప్రోగ్రాం లీడ్, లారెన్స్, మహిళా రైతులు పాల్గొన్నారు.
