ముస్తాబాద్/నవంబర్/03; మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఏర్పడినటువంటి గ్రామ బాలల పరిరక్షణ కమిటీ కి సర్పంచి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అర్చన మాట్లాడుతూ ముఖ్యంగా బాల కార్మికులని, బాల్య వివాహాలనీ అరికట్టాలని, పిల్లలపై అత్యాచారాలు, అక్రమ దత్తతనీ అడ్డుకోవాలని, అదే విధంగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలని బాలల హక్కులను రక్షించడం ఈ గ్రామాన్ని బాలల స్నేహపూరిత గ్రామంగా తీర్చిదిద్దడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని మాట్లాడారు.ఈకార్యక్రమంలో ముఖ్యంగా ఎంపీడీవో రమదేవి, గ్రామ సర్పంచ్ కాశోల్లపద్మ- దుర్గప్రాసాద్, పంచాయతీ సెక్రెటరీ సిద్దుల శ్రీనివాస్, స్కూల్ విద్యా బోధకులు లక్షీ, నాగరాణి, బాలలక్ష్మి, కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
