-మట్టి గణపతితో స్ఫూర్తినిచ్చిన హనుమాన్ భక్త మండలి
-50 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక గ్రామం
-నాటి నుండి నేటి వరకు ఆగని భజనలు, కీర్తనలు
-ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తి భగవంతుని సేవకు పాత్రుడే
-ఘనంగా సన్మానించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు
భగవంతుని పేరు చెపితే చాలు ఆ గ్రామంలో ప్రతి భక్తుడు కూడా భక్తితో పరవశిస్తారు. అందుకే అ గ్రామం గణపతి ప్రతిష్టించడంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి ధార్మిక సేవా సంస్థ వారు గురువారం నాడు ఎర్రవల్లి హనుమాన్ భక్త మండలి వారిని శాలువా కప్పి సీతారాముల చిత్ర పఠాన్ని అందజేసిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవలో తరించే భాగ్యం అందరికీ రాదన్నారు. 50 సంవత్సరాలనుండి గణపతిని ప్రతిష్టించారంటే వీరి భక్తి అమోగం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం ఎర్రవల్లి గ్రామం అన్నారు. గణపతి నవరాత్రులే కాకుండ ప్రతిరోజూ నామ సంకీర్తనలో పాల్గొనడం ఈ గ్రామం విశిష్టత అని కొనియాడారు.
అనంతరం భక్తులు రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. మట్టి గణపతుల గురించి ప్రోత్సహించడం అయన రామభక్తికి నిదర్శనం అన్నారు.
