శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తాలూకా స్థాయి ముగ్గులపోటీ విజేతలకు శనివారం నాడు సత్యసాయిబాబా మందిరంలో బహుమతులను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి ల చేతుల మీదుగా ప్రథమ బహుమతి ప్రొద్దుటూరు ప్రేమావతి, ద్వీతీయ బహుమతి దుర్గం దీప, కొలపాక ప్రియాంక, తృతీయ బహుమతి రాచకొండ శ్రావణి, స్వరూప మరియు 50మందికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి నిర్విరామంగా శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో దైవ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఎన్ని నిర్వహిస్తున్న రామకోటి రామరాజు భక్తికి నిదర్శనమన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 378 మంది మహిళలు పాల్గొనడం సంతోషకరమన్నారు. మహిళలందరిని ఈ విదంగా చైతన్య పరుస్తున్న రామకోటి సంస్థను అభినందించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి మాట్లాడుతూ ప్రతి మహిళా కూడా తనదైన శైలిలో ముగ్గులు వేశారన్నారు. శ్రీరామకోటి భక్త సమాజం వారు ఇలాంటి పోటీలు పెట్టి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నాచారం దేవస్థాన మాజీ ఛైర్మన్ కొట్టాల యాదగిరి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కూడా దైవ చింతనలో కొంత సమయాన్ని గడపాలన్నారు. మహిలందరూ కూడా నువ్వా నేనా అన్నట్లు ముగ్గులు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో నాచారం గుట్ట డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సామాజిక సమరసత జిల్లా అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు, కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవి, కల్లూరు రాములు, జగ్గారి శ్రీహరి, మాలే శంకరయ్య, ఆంజనేయులు గౌడ్, డ్రైవర్ శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.