నెల్లూరు జిల్లా,వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద దళితులు ఆందోళన చేపట్టారు.
గుడ్లూరు కు చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 మందిని అదుపులో తీసుకొని చితకబాదిన ముత్తుకూరు పోలీసులు.
వెంకటాచలం సి ఐ సుబ్బారావు, ముత్తుకూరు ఎస్ ఐ విశ్వనాధ్ రెడ్డి, కానిస్టేబుల్ సుమన్, తమ పిల్లలను తీసుకొచ్చి అకారణం గా కొట్టారంటూ యువకుల తల్లుల ఆరోపణ…
గాయపడిన ఆరుగురిని,సామాజిక ఆరోగ్య కేంద్రంకి మెడికల్ చెకప్ కి తీసుకువచ్చిన పోలీసులుయువకుల శరీరంపై లాఠీ దెబ్బలు, రక్తపు గాయాలు చూసి తల్లడిల్లి పోతున్న యువకుల తల్లిదండ్రులు…
దళితులమైన మామీద పోలీస్ లు జులుం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆందోళన…
పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దళితులమైన తమపై ఇలా పోలీసులు అకారణంగా లాఠీలతో చితక బాధటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు తమ పిల్లలపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
