దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు మల్లేశం పల్లి, కోనాపూర్ తదితర గ్రామాల్లో శనివారం అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా వచ్చిన అక్షింతలను సర్పంచ్ లు దార సత్యం, పంచమి స్వామి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఇంటింటా తిరుగుతూ శ్రీరామ నామాన్ని జపిస్తూ అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామమందిర నిర్మాణం కోసం ఐదు శతాబ్దాల కల నెరవేరబోతుందని తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ ఆస్వాదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పబ్బ మాధవి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పబ్బ అశోక్, టౌన్ అధ్యక్షుడు గంప రవి, రామచంద్రం, రాజిరెడ్డి, సత్యనారాయణ గౌడ్, యాదిరెడ్డి, అనిల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రమేష్ గౌడ్, బాలయ్య, రమేష్, స్వామి గౌడ్, రమేష్ యాదవ్, రామన్ గౌడ్, పెంటయ్య, ఆంజనేయులు, నరేష్ గౌడ్, స్వామి గౌడ్, వెంకటేష్, రాజు, నర్సయ్య, ఎల్లం, పరశురాములు, తోపాటు ఆర్యవైశ్యులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..
