ముస్తాబాద్, సెప్టెంబర్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో 7) రేషన్ షాపులు ఖాళీగా ఉన్నాయి. కాళీ రేషన్ షాపులకు 112 మంది దరఖాస్తులు చేసుకున్న వారు రేషన్ షాపుల నియామకాలకు తేది 15.09.2024 ఆదివారం ఉదయం 11.గంట నుండి మధ్యాహ్నం1గం.వరకు సిరిసిల్ల కుసుమ రామయ్య హైస్కూల్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు ముస్తాబాద్ తాహసిల్దార్ సురేష్ ఓప్రకటనలో తెలిపారు. ప్రవేశ టికెట్లు తహసీల్దార్ కార్యాలయము యందు కలవు. దరఖాస్తు చేసుకున్నవారు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని మండల తాహసిల్దార్ ఆఫీసులో అందజేసి హాజరు కావడానికి అనుమతి టికెట్లు తీసుకోగలరని పేర్కొన్నారు.
