టెక్స్ టైల్ పార్క్ లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 2023 సం!! బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికుల కూలి పెంపు విషయంపై మంగళవారం టెక్స్ టైల్ పార్క్ యజమానుల సంఘం నాయకులు , సిఐటియు టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకుల మధ్య కూలి చర్చలు టెక్స్ టైల్ పార్క్ లోని ఆఫీసులో జరగాలి ఈ చర్చలలో ప్రస్తుతం మీటర్ కు 3 రూపాయలు ఉన్న కూలీని 3-70 పైసలకు పెంచుతూ ఒప్పందం జరిగిందిఈ కూలీ చర్చలు జరిగిన అనంతరం సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ టెక్స్ టైల్ పార్క్ లో ఉత్పత్తి అవుతున్న 2023 సంవత్సరం బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు కూలి గిట్టుబాటు కావడంలేదని కూలి పెంచాలని గత వారం రోజుల క్రితం యూనియన్ ఆధ్వర్యంలో యజమానుల సంఘానికి వినతి పత్రం అందించడం జరిగిందని ఈరోజు యజమానుల సంఘం నాయకులు కూలి చర్చలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఒక మీటర్ కు 3 రూ!! లు ఇస్తున్న కూలిని 70 పైసలు పెంచి మీటర్ కు 3- 70 పైసలు కూలిగా ఒప్పందం జరిగిందన్నారు బతుకమ్మ చీరల ఆర్డర్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఈ సంవత్సరం మాత్రమే ఒప్పందం అమల్లో ఉంటుందని ఉన్నారు కార్మికులు తెలియజేయగానే చర్చలు జరిపి కూలి పెంచినటువంటి టెక్స్ టైల్ పార్క్ యజమానులందరికీ సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ మరియు కార్మికులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారుఈ కూలీ చర్చలలో సిఐటియు పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ , జెల్ల సదానందం , కారంపురి మహేష్ , శ్రీనివాస్ , మహేష్ టెక్స్ టైల్ పార్క్ యజమానుల సంఘం నుండి అధ్యక్షులు అన్నల్దాస్ అనిల్ , యేల్ల లక్ష్మీనారాయణ , వేణు , లక్ష్మణ్ , రాజేశం , సంతోష్ యజమానులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




