ప్రాంతీయం

బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో స్వచ్ఛత. హే సేవ పక్షోత్సవాలు

124 Views

సిద్దిపేట జిల్లా
గజ్వేల్ మండల బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ పాశం బాపు రెడ్డి. మరియు పంచాయతీ సెక్రెటరీ జయరాం ఆధ్వర్యంలో స్వచ్ఛత. హే సేవ పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛత హి స్వచ్ఛభారత్ వివరాలు సూచనలు సలహాలు తెలుపుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యము అని అన్నారు మనం అశ్రద్ధ చేయడం వల్ల గ్రామాలు నగరాలు కార్యాలయాలు వైద్యశాలలు చెత్తా చెదారాలతో నిండిపోయాయని దీనిని గుర్తించి స్వచ్ఛభారత్ లో భాగంగా మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు అలాగే రోడ్లపై చెత్త పోయానీకుండా చెత్త కుండీలలో వేసే విధంగా చూడాలి మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశములలో చేయరాదు తప్పనిసరిగా మరుగుదొడ్లు వినియోగించుకోవాలని చెరువులు బావులు నదులను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే మన గ్రామాన్ని మనమే శుభ్రంగా ఉంచి పరిశుద్ధమైన గ్రామం అని పేరు వచ్చే విధంగా గ్రామ ప్రజలు అందరూ కలిసి కృషి చేయాలని అన్నారు స్వచ్ఛతాహి సేవ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి ఉప సర్పంచ్ స్వరూప మల్లేశం వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రెటరీ జయరాం కారోబార్ మిరాన్ అంగన్వాడీ టీచర్ వనజ. ఆశా వర్కర్లు కమల శోభ నర్సింలు రాములు మల్లయ్య బిక్షపతి గ్రామపంచాయతీ కార్మిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *