చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న ముత్యాలమ్మ* దేవస్థానం చైర్మన్ పదవి నీ *టిడిపి*, *బిజెపి* నాయకులు పోటీ పడుతున్నారు. టిడిపి నుండి కోట మండలం కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త చిల్లకూరు దశరథ రామి రెడ్డి, చిల్లకూరు చెందిన పట్టాభి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బిజెపి పార్టీకి చెందిన గిరిధర్ రెడ్డి. టిడిపిలో ఆ పదవికి ప్రస్తుతం త్రిముఖ పోటీ ఉంది. బిజెపి నుండి ఏకైక అభ్యర్థి గిరిధర్ రెడ్డి ఆ పదవిని ఆశిస్తున్నారు. ఆ పదవి పొత్తులో భాగంగా బిజెపికి కేటాయిస్తే ఎంపిక సునాయిసముగానే జరిగిపోతుంది. కానీ టిడిపికి ఇస్తే మాత్రం ఎంపిక కష్టతరంగా మారబోతుంది. సీనియర్ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త *చిల్లకూరు దశరథ రామిరెడ్డి* కె ఆ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది.
