ప్రాంతీయం

అన్నదానం మహాదానం – గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

100 Views

గజ్వేల్ ప్రజ్ఞ పూర్ మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి  సౌజన్యంతో వైశ్య సంగం వారి ఆధ్వర్యంలో బుదవారం అమావాస్య అన్నదాన కార్యక్రమం.నిర్వహించారు ప్రతి అమావాస్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు నేతి చిన్న రాజయ్య నేతి చిన్న రాజమణి జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం దాదాపు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని పితృదేవతలకు శాంతి కలుగుతుందని దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రతి అమావాస్యనాడు అన్నదానం నిర్వహిస్తున్న వైశ్య సంఘం నేతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ అధ్యక్షులు నేతి చిన సంతోష్, కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, మాజీ వైస్ ఎంపీపీ ఆత్తెళ్ళి లక్ష్మయ్య, అయిత సత్యనారాయణ, తోట బిక్షపతి, ఉమేష్, రుకమయ్య, నాగేంద్రం, శ్రీను, ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యులు విష్ణు వర్ధన్,ప్రవీణ్, బాలేష్,సంతోష్, దయానంద్, వైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel