తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిది) ఏప్రిల్ 14
నెల్లికుదురు మండల కేంద్రంలో నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 వ జయంతి మహోత్సవాలు మహనియుల ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో వైభవంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు.మహనియుల కమిటి ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్,ఫూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కూరపాటి నారాయణ మండల కేంద్రంలోని ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలు,సబ్బండ వర్గాల అందరితో కలిసి మహనియుల ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. మొదటగా గ్రామపంచాయతి వరకు కాలినడకతో ప్రదర్శన చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి సభాస్థలికి చేరుకొని మహనియులకు పూల మాలలు అర్పించి, మహనియుల గురించి ముఖ్య అతిథులు ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
